Satyaraj: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్న వేల కోట్ల రూపాయల సీనిమా వ్యాపారాన్ని.. దక్షిణాది సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసింది. ఆ ప్రశ్నలోని కట్టప్ప కూడా అదే స్థాయిలో ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయాడు. కట్టప్పగా నటించిన సత్యరాజ్ కూడా ప్రపంచ ప్రేక్షకుల దృష్టిలో గొప్ప నటుడిగా నిలిచిపోయాడు. నిజానికి సత్యరాజ్ బాహుబలి కంటే ముందు నుంచే సినీరంగంలో విలన్ గా పెద్ద పేరు తెచ్చుకున్నారు. విలన్ గానూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ సత్యరాజ్ ది ప్రత్యేకమైన స్థానం.
అంతేకాకుండా సత్యరాజ్ రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించారు. గతంలో కన్నడిగులపై కఠినంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, బాహుబలి విడుదల సమయంలో తనమాటలపై చేసి తప్పు ఒప్పుకున్నారు. అలాగే రజనీకాంత్ విషయంలోనూ సత్యరాజ్ వ్యవహరించారు. మొదటి నుంచి రజనీకాంత్ ను తీవ్రంగా విభేదించారు సత్యరాజ్. చాలా సందర్భాల్లో రజనీకాంత్ ను అవమాన పరిచేలా మాట్లాడారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనలో చాలా మార్పు వచ్చింది. రజనీకాంత్ తో కలసి కూలీ సినిమా చేశారు. ఆ సందర్భంగా చాలా హుందాగా వ్యవహరించారు. అలాగే రజనీని నిజమైన సూపర్ స్టార్ గా అంగీకరించారు. వయసు పెరిగే కొద్దీ సత్యరాజ్ కూడా పరిణతి చెందుతున్నట్లు కనిపిస్తోందని విమర్శకులు కూడా ప్రస్తుతం చెప్పుకుంటున్నారు.
Satyaraj: ఇలా సినిమాల్లో విలన్ గా.. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఏకిపారేసే వ్యక్తిగా కఠినంగా వ్యవహరించే సత్యరాజ్ నిజ జీవితంలో మాత్రం చాలా గొప్ప వ్యక్తి. నిజమైన ప్రేమకు నిర్వచనంగా సత్యరాజ్ ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే, సత్యరాజ్ నిజ జీవితంలో ప్రతిరోజూ బాధతోనే ఉంటారు. దీనికి కారణం ఆయన భార్య. సత్యరాజ్ చాలా కాలం క్రితం మహేశ్వరిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ సత్యరాజ్ భార్య మహేశ్వరి గత ఆరు సంవత్సరాలుగా కోమాలో ఉన్నారు. మహేశ్వరికి 2020 ప్రాంతంలో మెదడు రక్తస్రావం జరిగింది. అప్పటి నుండి కోమాలో ఉన్నారు. డాక్టర్లు కూడా మహేశ్వరిపై ఇప్పటికే ఆశలు వదులుకున్నారు. ఆమె కోలుకోవడం అసాధ్యమని వారు ఇప్పటికే చెప్పారు. కానీ, సత్యరాజ్ మాత్రం తన భార్య ఎప్పటికైనా మామూలు మనిషి అవుతుందనే నమ్ముతున్నారు. ఇప్పటీకీ ఆ విశ్వాసం కోల్పోలేదు. మహేశ్వరి ఇప్పటికీ ఇంకా లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు.
దీని గురించి గతంలో ఒక పోస్ట్ షేర్ చేసిన సత్యరాజ్ కుమార్తె దివ్య, ‘నా తల్లి గత నాలుగు (2024 పోస్ట్) సంవత్సరాలుగా కోమాలో ఉంది. మేము ఆమెను మా ఇంట్లో ఉంచుకున్నాము. మేము ప్రతిరోజూ ఆమెకు PEG ట్యూబ్ ద్వారా ఆహారం తినిపిస్తాము. గత కొన్ని సంవత్సరాలుగా నా తండ్రి మమ్మల్ని ఒంటరి తల్లిదండ్రులుగా చూసుకుంటున్నారు. మేము మా అమ్మను తిరిగి పొందుతామని మాకు తెలుసు. మేము ఆ ఒక్క వైద్య అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాము’ అని చెప్పింది.
Satyaraj: వైద్యులు నిరాకరించినప్పటికీ, సత్యరాజ్ వైద్య పరికరాల సహాయంతో ఇంట్లో తన భార్యను బతికించారు. ఆయన ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంత బాధలోనూ ఆయన తన సినిమాల ద్వారా వినోదాన్ని పంచుతూనే ఉన్నారు. సత్యరాజ్ భార్య మహేశ్వరి 2018 లో చిత్ర నిర్మాతగా ప్రవేశించి రెండు చిత్రాలను కూడా నిర్మించారు.
సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కర్కోటకుడిగా కనిపించే సత్యరాజ్.. తన భార్య పట్ల చూపించే ప్రేమ అద్భుతమైనది చెప్పవచ్చు. అలానే, చిన్న కారణాలతో విడాకుల వైపు పరుగులు తీసే ఇప్పటి యువత.. పెళ్లి అయిన కొన్ని రోజులకే వేరు కుంపట్లు పెట్టుకుంటున్న సెలబ్రిటీలకు సత్యరాజ్ జీవితం ఆదర్శం కావాలి.
HYDERABAD WEATHER Hyderabad WEATHER