FIFA world cup 2026: ప్రపంచాన్ని ఉర్రూతలూగించే క్రీడా సంగ్రామం అట్టహాసంగా మొదలైంది. మెక్సికోలో గురువారం రాత్రి అత్యద్భుతంగా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభ వేడుక జరిగింది. పాప్ స్టార్ షకీరా, నైజీరియన్ గాయకుడు బర్నా బాయ్ కలిసి ఫీఫా అధికారిక గీతం “డై-డై”ని పాడుతూ ఇచ్చిన ప్రదర్శన అందర్నీ సమ్మోహనపరిచింది. దాదాపు రెండుగంటల పాటు జరిగిన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రియులను అలరించింది. ప్రారంభోత్సవ కార్యక్రమ ముగింపులో హాలీవుడ్ నటి సల్మా హాయెక్ సమక్షంలో ఫీఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ప్రపంచ కప్ ట్రోఫీని అందజేశారు. కొలంబియన్ గాయకుడు జే బల్విన్ కూడా ఈ అద్భుతమైన షో లో పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఎందుకు?
FIFA world cup 2026: ప్రపంచ కప్ మొదలవుతున్న సమయంలో కూడా మెక్సికోలో నిరసనలు కొనసాగాయి. ఉపాధ్యాయుల జీతాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం సామాజిక సమస్యలను విస్మరించి, ప్రపంచ కప్ నిర్వహణపైనే దృష్టి సారిస్తోందని నిరసనకారులు ఆరోపించారు. వారి డిమాండ్స్ పరిశీలించకుండా.. ఇబ్బందులు పరిష్కరించకుండా వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారంటూ ఆందోళన కారులు నిరసన వ్యక్తం చేశారు.
FIFA world cup 2026 మొదటి మ్యాచ్ విజేత ఎవరు?
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2026 మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికా-మెక్సికోల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో మెక్సికో విజయం సాధించింది.
ఆట సాగిందిలా..
fifa world cup 2026: ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలో మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోన్స్ తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో స్ట్రైకర్ రౌల్ జిమెనెజ్ అద్భుతమైన హెడర్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఈ మ్యాచ్ లో రిఫరీ మొత్తం మూడు రెడ్ కార్డులు ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు చెందిన స్ఫెఫ్లో సిథోల్, థెంబా జ్వానేలకు రెడ్ కార్డులు ఇవ్వగా.. అదనపు సమయంలో మెక్సికో ఆటగాడు సీజర్ మోంటెస్‌కు కూడా రెడ్ కార్డ్ చూపించారు.
జూలియన్ మొదటి గోల్..
9వ నిమిషంలో మెక్సికో ఆధిక్యంలోకి వచ్చింది. దక్షిణాఫ్రికా కెప్టెన్, గోల్ కీపర్ రాన్వెన్ విలియమ్స్ చేసిన పొరపాటు వారికి నష్టం కలిగించింది. విలియమ్స్ ఇచ్చిన బ్యాక్‌పాస్‌ను సద్వినియోగం చేసుకున్న జూలియన్ క్వినోన్స్, టోర్నమెంట్‌లో మొదటి గోల్ సాధించాడు.
44వ నిమిషంలో, క్వినోన్స్ కొట్టిన షాట్ పోస్ట్‌కు తగిలి బయటకు వచ్చింది. మరోవైపు, దక్షిణాఫ్రికా మొదటి అర్ధభాగంలో ఒక్క దాడి కూడా చేయడంలో విఫలమై, విరామ సమయానికి 1-0తో వెనుకబడింది.
ఆధిక్యాన్ని రెట్టింపు చేసిన జిమెనెజ్
67వ నిమిషంలో, మెక్సికో ఆటగాడు రాబర్టో అల్వరాడో పంపిన క్రాస్‌ను స్ట్రైకర్ రౌల్ జిమెనెజ్ హెడర్‌తో గోల్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో మెక్సికో తమ ఆధిక్యాన్ని 2-0కి పెంచుకుని మ్యాచ్‌ను గెలుచుకుంది.
మ్యాచ్‌లో 3 రెడ్ కార్డ్‌లు
fifa world cup 2026: దక్షిణాఫ్రికా మిడ్‌ఫీల్డర్ స్పెఫెలో సిథోలే రెండవ అర్ధభాగం ప్రారంభంలోనే రెడ్ కార్డ్ అందుకున్నాడు. 49వ నిమిషంలో, గోల్ వైపు దూసుకెళ్తున్న బ్రయాన్ గుటియెర్రెజ్‌ను సిథోలే వెనుక నుండి ఫౌల్ చేశాడు. దీంతో రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు.
దక్షిణాఫ్రికా కష్టాలు అంతటితో ముగియలేదు. 84వ నిమిషంలో, హింసాత్మక ప్రవర్తనకు పాల్పడినందుకు థెంబా జ్వానేకు రెడ్ కార్డ్ చూపించారు. ఫలితంగా, దక్షిణాఫ్రికా ఆ తరువాత మ్యాచ్‌ను తొమ్మిది మంది ఆటగాళ్లతో ఆడవలసి వచ్చింది. ఇంజూరీ టైమ్‌లో గోల్‌ను అడ్డుకున్నందుకు మెక్సికో ఆటగాడు సీజర్ మోంటెస్‌కు కూడా రెడ్ కార్డ్ చూపించారు.
ఇరు జట్ల ప్రారంభ XI
మెక్సికో – రౌల్ రాంజెల్ (కెప్టెన్), సీజర్ మోంటెస్, జోహన్ వాస్క్వెజ్, ఇజ్రాయెల్ రెయెస్, జీసస్ గల్లార్డో, ఎరిక్ లిరా, అల్వారో ఫిడాల్గో, బ్రియాన్ గుటిరెజ్, రౌల్ జిమెనెజ్, జూలియన్ క్వినోన్స్ మరియు రాబర్టో అల్వరాడో.
దక్షిణాఫ్రికా- రాన్‌వెన్ విలియమ్స్ (కెప్టెన్), ఆబ్రే మోడిబా, ఎంబెకెజెలి ఎంబోకాజి, న్కోసినాటి సిబిసి, ఖులిసో ముదౌ, ఇమే ఓకాన్, టెబోహో మొకోయెనా, స్పెఫెల్లో సిథోల్, జేడెన్ ఆడమ్స్, లైల్ ఫోస్టర్ మరియు ఇక్రమ్ రేనర్స్.
HYDERABAD WEATHER Hyderabad WEATHER