Peddi Movie Review: సిల్వర్ స్క్రీన్ మీద పెద్ది ఆట మామూలుగా లేదుగా..

Peddi Movie Review in Telugu

Peddi Movie Review: ఒక కథను వెండితెర మీద ;ఆవిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి కథనైనా తెరకెక్కించిన తరువాత ప్రేక్షకుల మెప్పు పొందాలంటే చాలా విషయం ఉండాల్సిందే. అందులోనూ పెద్ద హీరోలతో  దర్శకులకు కత్తిమీద సామే. ఎలివేషన్స్ ఇవ్వాలి.. హీరోను సూపర్ హీరోగా ప్రతి ఫ్రీములోనూచాలి.. గ్రాఫిక్స్ మాయలు కనిపించాలి.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో హంగులు చేరిస్తేనే కానీ, ఆ మూవీ హిట్ ట్రాక్ ఎక్కదు. ఇదంతా ఎందుకంటే,  సానా బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ లాంటి హీరోతో తెరకెక్కించిన.. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య వచ్చిన పెద్ది సినిమా గురించి చెప్పడం కోసమే. 

తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు చాలా తక్కువ. ఆమాట కొస్తే దేశంలోనే తక్కువ అని చెప్పాలి. అడపా దడపా వచ్చినా అవి అయితే దేశం కోసం ఒక స్పోర్ట్స్ పర్సన్ పడే తపన లేదా తనను తానూ నిరూపించుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే కథ.. కథనంగానే ఉంటాయి. కానీ, ఒక సామాజిక బాధ్యత కోసం పోరాటం చేసే ఆటగాడి కథ తెలుగు తెరమీద అరుదనే చెప్పాలి. అలాంటి ఒక కథాంశంతో రామ్ చరణ్ పెద్ద సాహసమే(Peddi Movie Review) చేశాడు పెద్ది కోసం. బుచ్చిబాబు పదే పదే చెప్పినట్టు రామ్ చరణ్ లాంటి హీరో ఈ కథను ఒప్పుకోవడమే సినిమాకి ప్లస్ పాయింట్. సినిమా ఎలా ఉంది అని చెప్పుకునే ముందు మూవీ స్టోరీ నాలుగు ముక్కల్లో..

కథ ఇదీ..

విజయనగరం జిల్లాలో కొండ కింద ఉండే ఒక గ్రామం. అక్కడ కొంతమంది జనాభా లెక్కల్లో ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు  లేకుండా జీవిస్తుంటారు. ఆ ఊరికి ఒక్కటే గుర్తింపు అది పెద్ది. ఆట కూలీ గా ఎవరు తనను వేలం పాటలో గెలుచుకుంటే వారి తరఫున క్రికెట్ ఆడే ఆటగాడు. ఊరిలో మగాళ్లంతా కనీసం నడక దారి కూడా సరిగా లేని మార్గంలో విజయనగరం చేరుకొని అక్కడ తక్కువ కూలీకి నెలలో 26 రోజులు కష్టపడి నాలుగు రోజులు  జీవిస్తుంటారు. ఆ ఊరి మీదుగా రైళ్లు వెళతాయి కానీ, గుర్తింపు లేని ఆ ఊరికి స్టేషన్ ఉండదు. ఆ ఊరిలో రైలు ఆగితే ఊరి ప్రజల కష్టాలు తీరతాయని భావించే అప్పల సూరి అనే వ్యక్తి విశ్వ ప్రయత్నం చేస్తాడు. కానీ, ఫలితం ఉండదు. గుర్తింపు లేని ఊరికి.. ఓటు హక్కు లేని ప్రజలకు రైలు స్టేషన్ ఎలా ఇస్తామంటారు ఎమ్మెల్యే, అధికారులు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ది ఊరికి రైలు స్టేషన్ తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. దాని కోసం క్రికెట్ నుంచి కుస్తీల్లోకి.. కుస్తీ నుంచి అథ్లెటిక్స్ కి వెళతాడు. మరి పెద్ది(Peddi Movie Review) ధ్యేయం నెరవేరిందా? ఆ ఊరికి గుర్తింపు వచ్చిందా? ఇదే పెద్ది కథ!

సినిమా ఎలా ఉందంటే..

సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. పెద్ది అనే ఆటగాడి నిజమైన లక్ష్యం వైపు ప్రయాణంలో ప్రేక్షకుడిని రయ్యి రయ్యి మంటూ తీసుకుపోతాడు దర్శకుడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా సినిమా ఒక రేంజిలో పరిగెడుతుంది. సరిగ్గా ఇంటర్వెల్ తరువాత నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ థియేటర్లలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ కి తీసుకు వెళ్లిపోయారు. ఇక ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ ఆ రేంజిలో లేకపోయినా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సాధారణ ఇండియన్ కమర్షియల్ సినిమా లానే అనిపిస్తుంది. కానీ, ఆ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటనతో ప్రేక్షకులను కట్టి పడేశాడు. 

టెక్నీకల్ గా ఏముంది ? 

టెక్నీకల్ విషయాలకు వస్తే రత్నవేలు ఫోటోగ్రఫీ ప్రతి ఫ్రెమ్ ను రిచ్ గా మార్చేసింది. రత్నవేలు తన కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకునేలా ఈ సినిమా(Peddi Movie Review)లో కొన్ని షాట్స్ ఉంటాయి. ఏఆర్ రెహమాన్ మళ్ళీ తన మ్యాజిక్ చూపించాడు. తన స్టైల్ నుంచి కాస్త పక్కకు వచ్చి మరీ సినిమాకి రీ రికార్డింగ్ ఇచ్చాడు. ప్రతి సీన్ కూడా బీజీఎంతో మరింత అద్భుతంగా వచ్చింది. ఎడిటింగ్ విషయంలోనే కాస్త పడి ఉంటే సినిమా నిడివి కాస్త తగ్గడమే కాకుండా.. మరింత క్రిస్పీ గా వచ్చేది అనిపిస్తుంది. అలానే సినిమాకి వేసిన సెట్టింగ్స్ కూడా చాలా బావున్నాయి. 

ఎవరెలా చేశారంటే . .

ఇక నటన విషయానికి వస్తే రామ్ చరణ్ పెద్దిగా జీవించాడు అని చెప్పేకంటే.. పెద్దిగా మారిపోయాడు అని చెప్పవచ్చు. రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం అతన్ని నటన పరంగా సూపర్ అని ఇప్పటివరకూ చెప్పుకున్నారు. కానీ, ఇకపై పెద్ది రామ్ చరణ్ అని కచ్చితంగా చెప్పుకుంటారు. క్లైమాక్స్ లో తన నటనతో  అందర్నీ తన ఎమోషనల్ (Peddi Movie Review)మూడ్ లోకి తీసుకుపోయాడు. రామ్ చరణ్ తరువాత.. అప్పలసూరిగా జగపతి బాబు కూడా ఎక్కడా తగ్గలేదు. మేకప్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సరికొత్తగా జగపతిబాబు కనిపించారు. ఇంకా చెప్పాలంటే అప్పల సూరి మాత్రమే  కనిపిస్తాడు.సినిమా నుంచి బయటకు వచ్చాకా కూడా మనతో వచ్చేస్తాడు. మిగిలిన నటీనటులంతా ఫర్వాలేదనిపించారు. ఏమిటీ జహ్నవి కపూర్ గురించి చెప్పడం లేదు అనుకుంటున్నారా? చెప్పడానికేమీ లేదు. తనకు నటించే అవకాశం లేదు కేవలం విప్పి చూపించడం తప్ప. కొంచెం ఇబ్బంది అనిపించినా విషయం అదే. గ్లామర్ బొమ్మలా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే మెప్పించవచ్చు. 

సినిమాలో ప్లస్ పాయింట్స్ కథ.. కథనం.. రామ్ చరణ్.. జగపతి బాబు.. బుచ్చిబాబు . డైరెక్షన్.రహమాన్ బీజీఎమ్.  మైనస్ పాయింట్స్ క్లైమాక్స్  కొద్దిగా సాగదీసినట్టు ఉండడం. హీరోయిన్ – హీరో మధ్య వచ్చే సీన్స్, హీరోయిన్ ఓవర్ ఏపోజింగ్, కొన్ని చోట్ల అనవసరంగా వినిపించే బీప్ డైలాగ్స్. 

ఇదీ విషయం..

మొత్తంగా చెప్పాలంటే పెద్ది టీమ్ వర్క్ ఫలించింది. కమర్షియల్ హంగుల కోసం అని పెట్టిన హీరోయిన్ సీన్స్, ఐటం సాంగ్ తీసేస్తే మూవీ మంచి ఫీల్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. స్మగ్లర్లను దేశోద్దారకులుగా చూపిస్తున్న సినిమాలు వస్తున్న ప్రస్తుత కాలంలో.. స్ఫూర్తినిచ్చే ఇలాంటి ఒక కథను సినిమాగా తీసుకురావడం మంచి విషయంగా చెప్పవచ్చు. కమర్షియల్ గా మూవీ ఎంత సక్సెస్ సాధిస్తుంది.. బాక్సాఫీస్ రికార్డ్స్ వంటి వాటిని పక్కన పెట్టేస్తే పెద్ది తప్పనిసరిగా చూడాల్సిన మూవీ అని చెప్పవచ్చు. ముందే చెప్పినట్టు రామ్ చరణ్ పెద్దిగా పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. తను ప్రాణం పెట్టి చేసిన పాత్ర అని ఎన్నోసార్లు అయన చెప్పిన విషయం సినిమా చూస్తె నూరుశాతం కరెక్ట్ అనిపిస్తుంది. 

చివరగా.. ఇది చూడాల్సిన సినిమానే.. ఎందుకంటే.. పెద్ది లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా ఏంటి?

 

HYDERABAD WEATHER Hyderabad WEATHER