Annamalai Resignation: బీజేపీకి గుడ్‌బై చెప్పిన అన్నామలై.. కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన కె. అన్నామలై వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, యువ నాయకుడు కె. అన్నామలై భారతీయ జనతా పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. అదే సమయంలో తాను కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు.
