క్రికెట్ చరిత్రలో ఇంత విచిత్రమైన మ్యాచ్‌ను ఎవరూ ఎన్నడూ చూసి ఉండరు! సాధారణంగా, ఒక టీ20 మ్యాచ్ కనీసం 3 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తారు. అయితే, మలేషియాలో జరుగుతున్న ఏసీసీ మహిళల టీ20 ప్రీమియర్ కప్‌లో యూఏఈ, సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది!