Women T20 World Cup 2026: రేపటి నుంచే 12 టీమ్స్..33 మ్యాచ్ లు మహిళల మెగా T20 ప్రపంచకప్.. పూర్తివివరాలివే!

Women T 20 World Cup 2026

Women T 20 World Cup 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కాబోతోంది

Women T20 World Cup 2026: మహిళా క్రికెట్ లో తొలిసారిగా అతి పెద్ద టీ20 ప్రపంచకప్ రేపు అంటే జూన్ 12 శుక్రవారం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 9 మహిళా ప్రపంచ కప్ పోటీలు జరిగాయి. అయితే, ఈ 10వ వరల్డ్ కప్ పోటీల్లో ఏకంగా 12 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరిగే ఈ టోర్నీ మొత్తం 24 రోజుల్లో 33 మ్యాచ్ లు జరుగుతాయి.  తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంకల మధ్య జరుగుతుంది. ఫైనల్ జూలై 5న లార్డ్స్‌లో జరుగుతుంది. 

ఇక మొట్టమొదటి మహిళల టీ20 ప్రపంచ కప్ 2009లో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొనగా, ఆతిథ్య దేశమైన ఇంగ్లాండ్ తొలి ఛాంపియన్‌గా నిలిచింది. మొదటి మూడు ప్రపంచ కప్‌లలోనూ ఎనిమిది జట్లు పోటీపడ్డాయి. 2014లో జట్ల సంఖ్య 10కి పెరిగింది. 2026లో తొలిసారిగా 12 జట్లు పాల్గొననున్నాయి. 17 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తుండడం విశేషం. 

Women T20 World Cup 2026: ఇప్పటివరకూ కప్ గెలవని భారత్..

ఇప్పటివరకు జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్‌లలో ఇదే అతిపెద్దది కానుంది. 2024లో తమ తొలి టైటిల్‌ను గెలుచుకున్న న్యూజిలాండ్ ప్రస్తుత ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెడుతోంది.  ఆరు ట్రోఫీలతో ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా బరిలో నిలుస్తోంది.  భారత్ ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేదు. అయితే మన టీమ్  నాలుగుసార్లు సెమీఫైనల్‌కు, ఒకసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి జట్లు ఉన్న ‘గ్రూప్ ఆఫ్ డెత్’లో భారత్ ఉంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో ఆడనుంది.

టోర్నమెంట్ ఇలా.. 

12 జట్లను ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉండేలా A – B అనే రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రతి గ్రూపు నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ-ఫైనల్ విజేతలు ఫైనల్‌లో ఆడతారు.

భారత్ పోటీలు ఎప్పుడు?

Women T20 World Cup 2026: భారత జట్టు జూన్ 14న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రపంచకప్ వేట మొదలెడుతుంది. ఆ తరువాత కీలకమైన మ్యాచ్ జూన్ 28న ఆస్ట్రేలియాతో ఉంటుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు జూన్ 21న తలపడతాయి. ఈసారి గ్రూప్ ‘ఎ’ను ‘గ్రూప్ ఆఫ్ డెత్’ అని చెప్పవచ్చు. ఎందుకంటే,  ఇందులో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లు ఉన్నాయి.

ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, శ్రేయాంకా పాటిల్ వంటి సూపర్ ప్లేయర్లు భారత టీమ్ లో ఉన్నారు. 

తొలిసారిగా.. 

తొలిసారిగా 12 జట్లు: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో 12 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. గతంలో 10 జట్లు ఆడాయి.

నెదర్లాండ్స్ అరంగేట్రం: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ తొలిసారిగా అడుగుపెట్టనుంది. గ్లోబల్ క్వాలిఫయర్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఈ జట్టు టోర్నమెంట్‌కు అర్హత సాధించింది.

భారత్ పరిస్థితి ఏమిటి?

భారత్ ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ప్రపంచ కప్‌లలోనూ ఆడింది. 2020లో, ఈ జట్టు తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుని, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ నాలుగు సార్లు సెమీఫైనల్‌కు కూడా చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ 40 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 22 గెలిచి, 18 ఓడిపోయింది. మన టీమ్  గెలుపు శాతం 55%.

Women T20 World Cup 2026 మ్యాచ్ ల టైమింగ్స్ ఏమిటి? 

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు, సాయంత్రం 7:00 గంటలకు, రాత్రి 11:00 గంటలకు ఉంటాయి. అలాగే భారత్ పాల్గొనే మ్యాచ్‌లన్నీ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.

టైటిల్‌కు ఫేవరేట్ ఎవరు?

ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.  భారత్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య దేశమైన ఇంగ్లాండ్ కూడా టైటిల్ రేసులో ఉన్నాయి. భారత్ గతేడాది వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని, తమ తొలి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా గత మూడు ఐసీసీ వైట్-బాల్ టోర్నమెంట్ల ఫైనల్స్‌లో ఆడింది.

ప్రైజ్ మనీ  ఎంత?

Women T20 World Cup 2026: ఐసీసీ రికార్డు స్థాయిలో మొత్తం 8.764 మిలియన్ డాలర్ల (సుమారు ₹83.74 కోట్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది. 2009 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతలు 2.34 మిలియన్ డాలర్లను (సుమారు ₹22.36 కోట్లు) అందుకున్నారు. దీనితో పోలిస్తే ఈసారి ఇస్తున్న ప్రైజ్ మనీ దాదాపు నాలుగు రేట్లు ఎక్కువ.

టోర్నమెంట్ ఎక్కడ చూడొచ్చు?

భారతదేశంలోని ప్రేక్షకులు ప్రపంచ కప్ మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ICC.TV కూడా ఈ టోర్నమెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. 

టోర్నీ షెడ్యూల్ ఇదే..

తేదీ మ్యాచ్ సమయం (భారత కాలమానం) వేదిక
12 జూన్ 2026 ఇంగ్లాండ్ vs శ్రీలంక రాత్రి 11:00 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
13 జూన్ 2026 స్కాట్లాండ్ vs ఐర్లాండ్ మధ్యాహ్నం 3:00 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
13 జూన్ 2026 ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా సాయంత్రం 7:00 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
13 జూన్ 2026 వెస్టిండీస్ vs న్యూజిలాండ్ రాత్రి 11:00 రోజ్ బౌల్, సౌతాంప్టన్
14 జూన్ 2026 బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్ మధ్యాహ్నం 3:00 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
14 జూన్ 2026 భారత్ vs పాకిస్థాన్ సాయంత్రం 7:00 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
16 జూన్ 2026 న్యూజిలాండ్ vs శ్రీలంక సాయంత్రం 7:00 రోజ్ బౌల్, సౌతాంప్టన్
16 జూన్ 2026 ఇంగ్లాండ్ vs ఐర్లాండ్ రాత్రి 11:00 రోజ్ బౌల్, సౌతాంప్టన్
17 జూన్ 2026 ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మధ్యాహ్నం 3:00 హెడ్డింగ్లీ, లీడ్స్
17 జూన్ 2026 భారత్ vs నెదర్లాండ్స్ సాయంత్రం 7:00 హెడ్డింగ్లీ, లీడ్స్
18 జూన్ 2026 వెస్టిండీస్ vs స్కాట్లాండ్ రాత్రి 11:00 హెడ్డింగ్లీ, లీడ్స్
19 జూన్ 2026 న్యూజిలాండ్ vs ఐర్లాండ్ రాత్రి 11:00 రోజ్ బౌల్, సౌతాంప్టన్
19 జూన్ 2026 పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ సాయంత్రం 7:00 రోజ్ బౌల్, సౌతాంప్టన్
20 జూన్ 2026 ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ మధ్యాహ్నం 3:00 రోజ్ బౌల్, సౌతాంప్టన్
20 జూన్ 2026 ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్ రాత్రి 11:00 హెడ్డింగ్లీ, లీడ్స్
21 జూన్ 2026 వెస్టిండీస్ vs శ్రీలంక మధ్యాహ్నం 3:00 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్
21 జూన్ 2026 దక్షిణాఫ్రికా vs భారత్ సాయంత్రం 7:00 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
23 జూన్ 2026 న్యూజిలాండ్ vs స్కాట్లాండ్ మధ్యాహ్నం 3:00 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్
23 జూన్ 2026 శ్రీలంక vs ఐర్లాండ్ సాయంత్రం 7:00 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్
23 జూన్ 2026 ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ రాత్రి 11:00 హెడ్డింగ్లీ, లీడ్స్
24 జూన్ 2026 ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ రాత్రి 11:00 లార్డ్స్, లండన్
25 జూన్ 2026 భారత్ vs బంగ్లాదేశ్ సాయంత్రం 7:00 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
25 జూన్ 2026 దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ రాత్రి 11:00 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్
26 జూన్ 2026 శ్రీలంక vs స్కాట్లాండ్ రాత్రి 11:00 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
27 జూన్ 2026 పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ మధ్యాహ్నం 3:00 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్
27 జూన్ 2026 వెస్టిండీస్ vs ఐర్లాండ్ రాత్రి 11:00 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
27 జూన్ 2026 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ రాత్రి 11:00 లార్డ్స్, లండన్
27 జూన్ 2026 దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ మధ్యాహ్నం 3:00 లార్డ్స్, లండన్
28 జూన్ 2026 ఆస్ట్రేలియా vs భారత్ సాయంత్రం 7:00 లార్డ్స్, లండన్
30 జూన్ 2026 తొలి సెమీఫైనల్ మధ్యాహ్నం 3:00 లార్డ్స్, లండన్
2 జూలై 2026 రెండో సెమీఫైనల్ రాత్రి 11:00 ది ఓవల్, లండన్
5 జూలై 2026 ఫైనల్ సాయంత్రం 7:00 లార్డ్స్, లండన్
Women T20 World Cup Schedule
Women T20 World Cup Schedule

 

HYDERABAD WEATHER Hyderabad WEATHER