World Record Win: ఐదు బాల్స్ లో విక్టరీ.. క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్!

World Record Win

యూఏఈ, సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది

World Record Win: క్రికెట్ చరిత్రలో ఇంత విచిత్రమైన మ్యాచ్‌ను ఎవరూ ఎన్నడూ చూసి ఉండరు! సాధారణంగా, ఒక టీ20 మ్యాచ్ కనీసం 3 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తారు. అయితే, మలేషియాలో జరుగుతున్న ఏసీసీ మహిళల టీ20 ప్రీమియర్ కప్‌లో యూఏఈ, సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది!

మలేషియాలో జరుగుతున్న 2026 ఏసీసీ మహిళల టీ20 ప్రీమియర్ కప్ టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే ఒక సంచలన ఫలితాన్ని ఇచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఫలితం కేవలం 5 బంతుల్లోనే నమోదైంది. ఈ టోర్నమెంట్‌లోని గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సౌదీ అరేబియా మహిళల జట్టు, యూఏఈ మహిళల జట్టు తలపడ్డాయి. 

World Record Win:ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌదీ అరేబియా మహిళల జట్టు యూఏఈ బౌలర్ల చేతిలో చిత్తుగా చాపచుట్టేసింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయిన సౌదీ జట్టు 15.3 ఓవర్లలో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది.

యూఏఈ తరఫున, హీనా హోట్‌చందానీ (3-4), సురక్షా కొట్టే (3-5), కెప్టెన్ ఇషా ఓఝా (3-9) తలా మూడు వికెట్లు తీసి సౌదీ అరేబియా బ్యాటింగ్ వెన్నెముకను విరిచారు.

World Record Win: కేవలం 5 బంతుల్లోనే..

28 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదిస్తున్న యూఏఈ జట్టుకు, సౌదీ అరేబియా బౌలర్ మహ నూర్ అమీర్ వేసిన మొదటి ఓవర్ ఒక వరంలా మారింది. దిశానిర్దేశం లేకుండా బౌలింగ్ చేసిన మహ నూర్, వరుసగా 10 వైడ్‌లు, ఒక నో-బాల్‌తో సహా మొత్తం 11 అదనపు పరుగులు ఇచ్చేసింది. 

మరోవైపు యూఏఈ కెప్టెన్ ఇషా ఓఝా కేవలం 5 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో అజేయంగా 15 పరుగులు చేసింది. మరో ఓపెనర్ తీర్థ సతీష్ తాను ఎదుర్కొన్న ఏకైక బంతికే బౌండరీ కొట్టింది. ఫలితంగా, యూఏఈ తొలి ఓవర్‌లోని (0.5 ఓవర్) 5వ బంతికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసి, 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రపంచ రికార్డు:

  •  115 బంతులు మిగిలి ఉండగా: యూఏఈ జట్టు 115 బంతులు (19.1 ఓవర్లు) మిగిలి ఉండగానే గెలిచింది. ఇది సరికొత్త ప్రపంచ రికార్డ్.
  •  మహిళల టీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) క్రికెట్ చరిత్రలో లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేరుకున్న వారిలో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచింది.

పరుగుల వేటలో 20 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్, క్రికెట్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన అరుదైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.

HYDERABAD WEATHER Hyderabad WEATHER