Peddi first day collections: వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఒక్కసారిగా రామ్ చరణ్ కెరీర్ పై పెద్ద మచ్చ పడింది. దానిని తుడిచేసుకోవడానికి పెద్ద సాహసమే చేశారు రామ్ చరణ్. అదే పెద్ది సినిమా. ఒక్క సినిమా అనునుభవం మాత్రమే ఉన్న సన బుచ్చిబాబు చెప్పిన కథకు ఒకే చెప్పేశారు. పెద్ది పేరు ప్రకటించిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఉత్సుకత ప్రారంభం అయింది. అది సినిమా రిలీజ్ టైమ్ కి తారాస్థాయికి చేరింది. సినిమా షూటింగ్ ఆలస్యం అయినా.. ఎన్నో రిలీజ్ డేట్స్ మారినా ప్రేక్షకుల్లో పెద్దిపై ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గలేదు.
Peddi first day collections: ఏఆర్ రహమాన్ పాటలు ప్రేక్షకులను ఎప్పుడెప్పుడు పెద్ది సినిమా చూస్తామా అనేలా చేశాయి. జూన్ 4న దేశవ్యాప్తంగా పెద్ది విడుదలైంది. రివ్యూవర్ల మిక్స్ టాక్ తట్టుకుని మొదటిరోజు బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది పెద్ది.
Peddi first day collections: మొదటిరోజే పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆసక్తిని పెంచిన ఈ మూవీ, మొదటి రోజే వంద కోట్ల మార్కును దాటి బాక్సాఫీస్ సుల్తాన్‌గా నిరూపించుకుంది. రామ్ చరణ్‌కు ఉన్న మాస్ క్రేజ్ మూవీకి కలెక్షన్ల వర్షం కురిపించింది. .
పెద్ది సినిమా థియేటర్లలో మొదటి రోజు ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుతో సహా అన్ని చోట్లా ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే రూ. 112.49 కోట్ల గ్రాస్ కలెక్షన్ (Peddi first day collections) సాధించింది. రామ్ చరణ్ అద్భుతమైన నటనకు, సినిమాలోని మాస్ అంశాలకు ఆకర్షితులైన ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు.
ఈ చిత్రం మొదటి రోజు 12,412 షోలను పొందింది. భారతదేశంలో మొదటి రోజు ఈ మూవీ నెట్ కలెక్షన్స్ 69.50 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 82.49 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు. ఇక పెద్ది మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 30.00 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.
RRR’ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు వచ్చాయి. ఆ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అందుకే రామ్ చరణ్ కి ఒక పెద్ద విజయం అవసరం. అంతేకాకుండా ప్రస్తుతం సినిమా థియేటర్ల పరిస్థితి ఏమీ బాగోలేదు. సరైన సినిమాలు లేక.. ప్రేక్షకులు రాక అవస్థలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో రామ్ చరణ్ పెద్ది కలెక్షన్ల వర్షంతో థియేటర్లు కళకళ లాడుతున్నాయి.
HYDERABAD WEATHER Hyderabad WEATHER