T20 World Cup 2026 ENG vs NEP: ముంబైలోని వాంఖడే స్టేడియం మరో చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. 2026 T20 ప్రపంచ కప్ రెండవ రోజు, బలమైన ఇంగ్లాండ్ -నేపాల్ ఒకదానికొకటి తలపడ్డాయి. రెండు జట్ల బలాన్ని పరిశీలిస్తే, ఇంగ్లాండ్ గెలుపు చాలా ఈజీగా అవ్వాలి. కానీ మ్యాచ్ ఆద్యంతం తన ఆట తీరుతో అదరగొట్టిన నేపాల్, చివరి ఓవర్లో 10 పరుగులు చేయలేకపోయింది. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ ఓడిపోయినప్పటికీ, క్రికెట్ పితామహులైన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఓటమి భయాన్ని కలిగించింది. చివరి బంతి వరకు ఇంగ్లాండ్ జట్టులోని ప్రతి ఆటగాడిలోనూ ఓటమి భయాన్ని నింపడంలో నేపాల్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే నేపాల్ 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 పరుగుల తేడాతో వీరోచిత ఓటమిని చవిచూసింది.
ఇంగ్లాండ్ 184 పరుగులు..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ జట్టు తరపున 35 బంతుల్లో 55 పరుగులు చేయగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు. విల్ జాక్స్ కూడా అజేయంగా 39 పరుగులు చేసి జట్టును పోటీతత్వ స్కోరుకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్లలో జాక్స్ బ్లాస్టింగ్ బ్యాటింగ్ చేయకపోతే, ఈ మ్యాచ్ ఫలితం వేరేరకంగా ఉండేది. ముఖ్యంగా, 20వ ఓవర్ చివరి బంతికి కొట్టిన సిక్స్ ఇంగ్లాండ్ విజయానికి దారితీసింది. అదే సమయంలో, నేపాల్ తరపున దీపేంద్ర సింగ్ ఐరి నందన్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, షేర్ మల్లా సందీప్ లామిచానే తలా ఒక వికెట్ తీసుకున్నారు.
T20 World Cup 2026 ENG vs NEP: ఆకట్టుకున్న నేపాల్.. పాపం అదృష్టం కలిసిరాలేదు !
నేపాల్ తమ లక్ష్యఛేదనలో మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఓపెనర్లు కుశాల్ భూర్తెల్ (29), దీపేంద్ర సింగ్ ఐరి (44) ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39) జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. చివరికి, లోకేష్ బామ్ 20 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేశాడు. కానీ అతను జట్టును విజయపథంలోకి తీసుకెళ్లలేకపోయాడు. చివరికి, నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు మాత్రమే చేసి, మ్యాచ్‌ను 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, నేపాల్ బ్యాటింగ్ – బౌలింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
HYDERABAD WEATHER Hyderabad WEATHER