T20 World Cup 2026: ఐర్లాండ్ పై శ్రీలంక విజయం

T20 World Cup 2026: కొలొంబోలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో శ్రీలంక జట్టు ఐర్లాండ్ ను 20 పరుగుల తేడాతో ఓడించింది

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌లో శ్రీలంక తన తొలి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆ జట్టు ఐర్లాండ్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 56 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. కమిండు మెండిస్ 19 బంతుల్లో 44 పరుగులు చేశాడు. బారీ మెక్కార్తీ, జార్జ్ డాక్రెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐరిష్ జట్టు 19.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ అయింది. మహీష్ తీక్షణ, వానిందు హసరంగా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మతిష పతిరానా రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో ప్రపంచ కప్ లో శ్రీలంక తాను ఆడిన తొలి మ్యాచ్ విజయవంతంగా గెలుచుకుంది. 

ఐర్లాండ్ తరఫున హ్యారీ టెకర్ 40 పరుగులు చేశాడు. రాస్ అడైర్ 34 పరుగులు జోడించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ బాగా రాణించలేకపోయారు. 

ప్లేయింగ్-11

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, మతిష్ పతిరన.

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్.

T20 World Cup 2026 పూర్తి షెడ్యూల్.. పాయింట్స్ టేబుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

HYDERABAD WEATHER Hyderabad WEATHER