Raja Saab Movie Review: మారుతి . . వింటేజ్ ప్రభాస్ ని చూపించాడా? మూవీ ఎలా ఉందంటే

Raja Saab Movie Review: ప్రభాస్ - మారుతి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ హర్రర్ థ్రిల్లర్ మూవీ రాజా సాబ్ ఎలా ఉందంటే..

Raja Saab Movie Review: రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా లెవెల్ కిక్. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కోట్లాదిరూపాయల బడ్జెట్ తో వచ్చే సినిమాలకు మొదటి ఆప్షన్ ఆయనే. బాహుబలి నుంచి ఇప్పటివరకూ ప్రభాస్ నుంచి ఆ రేంజ్ సినిమాలే వచ్చాయి. తన ఆహార్యం.. నటనా విధానం ఆ తరహా సినిమాలకే సరిపోతాయన్నట్టుగా దర్శకులు ప్రభాస్ ను మార్చేశారు. అయితే, మారుతి ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నారని మూడేళ్ళ క్రితం ఎనౌన్స్ మెంట్ వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ప్రభాస్ రేంజ్ ఏమిటి? మారుతి సినిమా స్టైల్ ఏమిటి? రెండిటికీ అసలు ఏమైనా పొంతన ఉందా? అని అందరిలోనూ సందేహాలు. ఆ సినిమాకి రాజాసాబ్ అని టైటిల్ ఎనౌన్స్ చేయగానే ఓహో ఇదేదో పెద్ద ప్లానే అనిపించింది. రిలీజ్ డేట్లు మారుతూ మారుతూ మొత్తమ్మీద ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. టీజర్లు.. ట్రైలర్లు సినిమా మీద ఒక రేంజ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి. ప్రత్యేకించి కామెడీ హారర్ జోనర్ లో మారుతి సినిమా చేస్తే అది పెద్ద హిట్టు అని ఉన్న నమ్మకం… అలాంటి జోనర్ లో మొదటిసారిగా ప్రభాస్ చేస్తుండడం.. పైగా ప్రభాస్ వింటేజ్ లుక్ తో కనిపిస్తుండడంతో మూవీపై అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. మరి థియేటర్లలో వచ్చిన వింటేజ్ ప్రభాస్ తో మారుతి ఏమి చేయించాడు? ప్రేక్షకులను భయపెట్టాడా? నవ్వించాడా? థ్రిల్ ఇచ్చాడా? ప్రభాస్ ఫాన్స్ కు పండగ ఫీస్ట్ ఇచ్చేశాడా? అవన్నీ తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయాల్సిందే. 

Raja Saab Movie Review: అనగనగా ఓ  పెద్దావిడ. ఆమెకు ఓ మనవడు. పాపం ఆ పెద్దావిడ కాస్త మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటుంది. ఎన్నో విషయాలు మర్చిపోతుంది. కానీ, తన భర్తను మాత్రం మర్చిపోదు. మనవడికి తనకు కలలో కనిపిస్తున్న తాతను ఎలాగైనా తీసుకురా అని చెబుతుంది. అయితే, మరోవైపు ఆమె భర్త ఈ నానమ్మ మనవళ్లను తానుంటున్న పెద్ద రాజమహల్ కి రప్పించుకుంటాడు. అసలే ఆయనగారు పెద్ద మాయగాడు. మంత్రతంత్రాలు తెల్సిన వాడు. మార్మిక విద్యాలతో ఆ మహల్ లోకి వచ్చిన మామ్మ, మనవడిని ఒక ఆట ఆదుకుంటాడు. అసలు ఈ తాతకి, ఆ మహల్ కి సంబధం ఏమిటి? అంత పెద్ద రాజమహల్ ఉన్న పెద్దావిడ అలా ఎందుకు ఏమీ లేనట్టు ఎక్కడో బతుకుతోంది. ఈ మనవాడి కథ ఏమిటి? తాత పెట్టిన టార్చర్ నుంచి ఈ మనవడు ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ సినిమాలో తెలుసుకోవాల్సిన విషయాలు. ఇందులో మనవడు ప్రభాస్ అయితే, తాత సంజయ్ దత్. ఇక నానమ్మ జరీనా వాహాబ్. ఈ ముగ్గురి మధ్య జరిగే కథే ఇది. కథ వింటే చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది కదూ. 

ఆ ఇంట్రస్టింగ్ కథని మారుతి తన స్టైల్ లో ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా కామెడీతో పాటు సూపర్ థ్రిల్ ఉంటుందని అంచనా వేస్తారు కదా. కానీ, రెండూ మిస్ అయ్యాయి ఈ సినిమాలో. వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తానన్న మారుతి.. ప్రభాస్ పాన్ ఇండియా మాయలో పడిపోయాడనిపిస్తుంది. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే కథనాన్ని ప్రభాస్ స్టార్ డమ్ డామినేట్ చేసేసింది. ప్రభాస్ ని ఎలా చూపించాలి.. ప్రభాస్ సినిమా అంటే ఒక రేంజ్ ఉండాలి అనేవిధంగానే సినిమాని ప్రెజెంట్ చేశాడు మారుతి. ఆ మాయలో పడిపోయి రెండు గంటల్లో క్రిస్పీగా చెప్పగలిగే కథని.. మూడు గంటలకు పైగా లాగి లాగి ప్రేక్షకులకు థ్రిల్ లేకుండా చేసినట్టు కనిపిస్తుంది. వింటేజ్ ప్రభాస్ ని చూపించడంలో మాత్రం మారుతి నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక సినిమా పరంగా పాస్ మార్క్ కి దగ్గరలోనే ఆగిపోయాడు. 

Raja Saab Movie Review: ఇక ఎవరు ఎలా చేశారు అనేది చెప్పుకోవాల్సి వస్తే.. ప్రభాస్ ఇరగదీశాడు. తన పాత స్టైల్ ని ఇప్పటి ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ పెర్ఫార్మ్ చేశాడు. అతని మామ్మగా జరీనా చాలా బాగా చేసింది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఇక సంజయ్ దత్ మాయగాడిగా అదరగొట్టేశాడు. ప్రభాస్-సంజయ్ దత్ ల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నా.. ఎవరికీ పెద్ద ప్రాముఖ్యత లేదు. కొంతలో కొంత మాళవిక బెటర్. ఒక ఫైట్ సీన్ ఆమెకు పడింది. అంతకు మించి వాళ్ళగురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక మారుతి కామెడీ కోసం చూసేవారికి ఆశాభంగమే కలుగుతుంది. ప్రభాస్‌శ్రీను, సప్తగిరి, సత్య, వీటీవీ గణేశ్ వీళ్లంతా కలిసి సినిమాలో అక్కడక్కడా నవ్విస్తారు. కానీ, ఆ నవ్వులు సరిపోలేదని చెప్పొచ్చు. 

టెక్నీకల్ విషయాలకు వస్తే ఫోటోగ్రఫీ బావుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బావున్నాయి. తమన్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేదని చెప్పాలి. బీజీఎమ్ అదరగొట్టే తమన్ ఈ మూవీలో  అదరగొట్టే క్రమంలో చెవులను బెదరగొట్టాడని చెప్పాలి. పాటలు కూడా ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకా చాలా చేయొచ్చు అనిపిస్తుంది. సినిమాని కనీసం 20 నిముషాలు కత్తిరించే అవకాశం ఉంది. 

Raja Saab Movie Review: మొత్తంగా చూసుకుంటే, ప్రభాస్ కోసం సినిమా చూడాలి అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అందరికీ కాస్త కిక్ ఇస్తాయి. మూడు గంటలపాటు సినిమా చూడాలంటే మాత్రం కాస్త ఓపిక కావలసిందే. కథనం అంత స్పీడ్ గా పరుగుతీయదు. 

చివరిగా వింటేజ్ ప్రభాస్.. ఆయన కామెడీ కోసం మూవీని తప్పనిసరిగా చూడొచ్చు. ఎందుకంటే అలాంటి నటనలో ప్రభాస్ ఎప్పుడూ రాజా సాబ్

గమనిక :  ఈ రివ్యూ రివ్యూయర్ వ్యక్తిగత అభిప్రాయం. రివ్యూయర్ సినిమాపై వెల్లడించిన అభిప్రాయంగా మాత్రమే దీనిని చూడాలి. సినిమా చూడమని కానీ ,  చూడొద్దని కానీ నంబర్ వన్ సూచించడం లేదు 

HYDERABAD WEATHER Hyderabad WEATHER