Sullurupeta: ఘనంగా అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు: వైఎస్సార్సీపీ శ్రేణుల రక్తదానం 

Sullurupeta YSRCP

వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు

Sullurupeta: వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ పరిశీలకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులు ప్రారంభించారు. అనంతరం అల్లూరు అనిల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అల్లూరు అనిల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సేవా భావనతో కూడిన కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా జన్మదినాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు.

HYDERABAD WEATHER Hyderabad WEATHER