Mantha Cyclone: తరుముకొస్తున్న మంథా.. ఆ ప్రాంతాల్లో హై అలర్ట్!

Mantha Cyclone

మంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై భారీగా పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ ఉన్న తీరప్రాంతానమంతా ఈ తుపాను తీవ్రతకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం ఎలర్ట్ అయింది. తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న అన్ని ప్రాంతాలలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి  నిరంతరం సమీక్షిస్తున్నారు .  ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయిడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుటూ అవసరమైన సూచనలు ఇస్తున్నారు .  ప్రస్తుతం తుపాను పరిస్థితి ఎలా ఉంది. ఐఎండీ ఏం చెబుతోంది తెలుసుకుందాం.

తుఫాన్ పరిస్థితి ఇలా..

  • ఈ తుపాను ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం (South-East Bay of Bengal) లోస్థిరంగా కదులుతోంది .

  • ఈ వాయుగుండం తీవ్రంగా మరి  ఆంధ్రప్రదేశ్ తీరంవైపు “తీవ్రమైన వాతావరణ పరిస్థితులుగా మారే అవకాశం” ఉందని చెబుతున్నారు.

  • ముఖ్యంగా,  తుపాను కాకినాడ  సమీప తీరంలో ల్యాండ్ఫాల్ (landfall) అవ్వవచ్చని ఊహిస్తున్నారు.  అక్టోబర్ 28 రాత్రి లేదా సాయంత్రం ఇది కాకినాడ దగ్గరలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు .

  • తుపాను ప్రభావంతో తీర ప్రాంతం వెంబడి గాలుల వేగం గంటకు 90-100 కి.మీల వరకూ ఉండొచ్చు.

  • వర్షపు ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉండబోతోందని అంచనా.  తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ప్రభుత్వ చర్యలు ఇలా . .

  • ప్రభుత్వాధికారులు అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉన్నారు .  అన్ని మండలాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

  • మత్స్యకారులు “సముద్రంలో వేటకు వెళ్లకూడదు” అన్న హెచ్చరిక విడుదల చేశారు . తీర ప్రాంతాల్లో అల్లకల్లోలంగా ఉంటుందని తీరం వెంబడి హెచ్చరికలు జరీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు .

  • ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి, వ్యవసాయ, మౌలిక వసతుల నిర్వహణ కోసం అన్ని శాఖలను సిద్ధంగా ఉంచారు.

  • ముఖ్యంగా, తీరప్రాంత  ప్రదేశాల్లో బీచ్ రోడ్లు మూసివేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు .  ఉప్పాడ బీచ్ రోడ్డును పూర్తిగా మూసివేశారు .  అటువైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

  • మీరు  తీరానికి సన్నిహితంగా  ఉన్న ప్రాంతాల్లో ఉంటె అప్రమత్తం కావాలని అధికారులు చెబుతున్నారు .

  • తీరప్రాంతాలలోని బీచ్‌లలో సముద్రస్నానాలు ఈసమయంలో మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

  • ఈ నెల 30 వరకు ప్రభుత్వ అధికారులు/ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. 

  • వరద ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రంగానికి సూచనలు చేశారు.

ముఖ్యమైన తేదీలు & సూచనలు

  • తుఫాన్ ప్రభావం ముఖ్యంగా అక్టోబర్ 27–29 మధ్యగా ఎక్కువ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు .

  • 28 వ తేదీన రాత్రి మంథా తుపాను తీరాన్ని తాకే అవకాశం ఎక్కువగా ఉంది.

  • తీరప్రాంతాల్లోని ప్రజలు, విద్యార్ధులు, మరియు వృత్తిపరమైన కార్యకలాపాల్లో ఉన్నవారు ప్రయాణాలను తగ్గించాలని, బాధ్యతగా ప్రవర్తించాలని అధికారులు  సూచిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ యంత్రంగం సూచనల మేరకు నడుచుకోవాలని చెబుతున్నారు.

  • మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని, పడవలు తీరంలో పెట్టివేయాలని అంటున్నారు.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతమంతా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని అధికారులు అంటున్నారు .  మంథా తుపాను వేగంగా దూసుకువస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఒక-ఒక చిన్న పొరపాటు  కూడా జీవన రక్షణలో కీలకంగా మలవవచ్చు. మీరు నివసిస్తున్న ప్రాంతం తీరప్రాంతానికి దగ్గరగా ఉంటే — స్థానిక అధికారుల సూచనలు పాటించండి.

HYDERABAD WEATHER Hyderabad WEATHER