ప్రస్తుతం లాక్‌డౌన్ పరిస్థితి ఉన్న దేశాలు ఏవి? శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్ పరిస్థితి పై విశ్లేషణ

ప్రపంచంలో ప్రస్తుతం లాక్‌డౌన్ తరహా పరిస్థితి ఉన్న దేశాలు ఏవి? శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నం‌లో ఆయిల్ సంక్షోభంపై విశ్లేషణ

ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితి ఉంది?

మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ కొరత కారణంగా శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాల్లో అప్రకటిత లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 

శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?

  • బీబీసీ రిపోర్ట్స్ ప్రకారం శ్రీలంకలో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి 
  • వారంలో నాలుగు రోజులు మాత్రమే స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు పనిచేస్తున్నాయి 
  • శని, ఆదివారాలతో పాటుగా ప్రతి బుధవారం సెలవు ప్రకటించారు. 
  • అత్యవసర సర్వీసులకు ఈ సెలవులు వర్తించవు. 
  • కారుకు 15 లీటర్లు.. బైక్ కు 5 లీటర్లు మాత్రమే పెట్రోల్ ఇస్తున్నారు. 

మయన్మార్ లో ఎలా చేస్తున్నారు?

  • రాయిటర్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇక్కడ ఇంధన సంక్షోభం తీవ్రంగానే ఉంది 
  • మయన్మార్ లో వెహికిల్స్ కోసం సరి-బేసి విధానాన్ని అమలు చేశారు.
  • 0,2,4,6,8 అంకెలతో ప్రారంభమయ్యే నెంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలు బేసి తేదీలలో తిరుగుతాయి 
  • 1,3,5,7,9 అంకెలతో ప్రారంభమయ్యే వాహనాలు సరి తేదీల్లో తిరుగుతాయి 

పాకిస్థాన్ లో స్మార్ట్ లాక్ డౌన్ అమలు చేస్తారా?

  • ఇంధన సంక్షోభం కారణంగా స్కూల్స్ కు రెండు వారాలు సెలవు ప్రకటించింది పాక్ ప్రభుత్వం 
  • ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడం తప్పనిసరి చేసింది 
  • ఇంధనం ఆదా చేయడం కోసం స్మార్ట్ లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉన్నట్టు సింధ్ స్థానిక ప్రభుత్వ శాఖ మంత్రి నాసిర్ హుస్సేన్ షా తెలిపారు.

బంగ్లాదేశ్ లో పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి?

  • బంగ్లాదేశ్ లో పరిస్థితి దిగజారిపోతోంది.
  • లీటరు పెట్రోల్ ధర 300 టాకాలు దాటింది. 
  • పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది. 
  • ఇప్పటికే స్కూల్స్ కు సెలవలు ప్రకటించారు. 

వియాత్నంలో లాక్ డౌన్ విధిస్తారా?

  • వియాత్నంలో పెట్రోల్ ధరలు 50-60 శాతం పెరిగాయి 
  • ఉద్యోగాలకు ఇంటి నుంచి పని చేయాలని సూచించారు.
  • విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించారు
  • పరిస్థితి మెరుగుపడకపోతే లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది

 

HYDERABAD WEATHER Hyderabad WEATHER